Telangana RTC Strike 2 | ఆర్టీసీ డ్రైవ‌ర్ మృతితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు.. అక్కడ బంద్​కు పిలుపు

Naresh Chandan
Telangana RTC Strike 2

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana RTC Strike 2  | తెలంగాణలో Telangana కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనల్లో విషాద ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో జరిగిన అత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది.

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (55) గురువారం నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం తీవ్ర విషాదానికి దారితీసింది.

80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను తొలుత నర్సంపేట ఆసుపత్రికి, ఆపై వరంగల్‌లోని MGM ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చివరికి హైదరాబాద్ లోని కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

Telangana RTC Strike 2 | వరంగల్ బంద్ పిలుపు

శంకర్‌గౌడ్ Shankar Goud స్వస్థలం ఖానాపురం కాగా, గత 30 ఏళ్లుగా నర్సంపేటలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుమార్తె శ్యామిలి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా, శంకర్‌గౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

శంకర్‌గౌడ్ మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ Warangal జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. నర్సంపేట డిపో వద్ద కార్మికులు ప్రైవేట్ బస్సులను అడ్డుకుంటూ రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Telangana RTC Strike 2 | మిర్యాలగూడలో..

ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో నల్లగొండ జిల్లాలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మిర్యాలగూడ డిపోకు చెందిన డ్రైవర్ రావుల వెంకన్న, ప్రభుత్వం స్పందించడం లేదనే ఆవేదనతో ధర్నా సమయంలో డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు.

అయితే పోలీసులు, తోటి కార్మికులు వెంటనే స్పందించి అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీనిని కూడా చదవండి: RTC Driver Death | ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి!

దీనిని కూడా చదవండి: RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్​ వాహనాల దోపిడీ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *