RTC Driver Death | ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి!

Naresh Chandan
RTC Driver Death

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC Driver Death | తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈరోజు (గురువారం) మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించారు.

RTC Driver Death | కర్మాన్​ఘాట్​ సమీపంలో..

80 శాతం కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను వరంగల్ నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్తుండగా.. కర్మాన్ ఘాట్ సమీపంలో ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో శంకర్​గౌడ్​ మృతదేహం ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో ఆర్టీసీ సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగి మృతిపై సహోద్యోగులు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

RTC Driver Death | భద్రాద్రిలోనూ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. భద్రాచలం (Badrachalam) ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న డి.లింగారెడ్డి పురుగుల మందు తాగారు. తోటి కార్మికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్యాయత్నం చేయగా..  అందులో శంకర్​గౌడ్​ మరణించారు.

దీనిని కూడా చదవండి : RTC Strike Issues | కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. ప్రైవేట్​ వాహనాల దోపిడీ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *