అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Gen Z Protest | దేశంలో యువతరం కదం తొక్కిందని, మునుపెన్నడూ లేని విధమైన కొత్త తరహాలో జెన్ జీ యువత ఢిల్లీ వీధుల్లో చేపట్టిన ఆందోళన దెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నరేంద్ర మోదీ ఎవరితో పెట్టుకోకూడదో ఆ పిల్లలతోనే పెట్టుకున్నారని, యువత కదం తొక్కితే ప్రభుత్వానికే కాదు మోదీ మీడియాకు కూడా బల్బులు ఎగిరిపోయాయన్నారు. ఢిల్లీలో జరిగిన పోరాటం వాట్సాప్ అంకుల్స్‌కు, ఇన్‌స్టాగ్రామ్ పిల్లలకు మధ్య జరిగిందని, ఈ పోరాటంలో ఎవరు గెలిచారో దేశమంతా చూసిందన్నారు. జెన్ జీ పిల్లలు సీబీఐ, ఈడీకి భయపడే రకం కాదన్నారు. ఇవాళ ఒక తెలుగు దినపత్రిక వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ హాట్ కామెంట్స్ చేశారు.
KTR Gen Z Protest | యువత శక్తి అద్భుతం..
యువతరాన్ని చూసి దేశంమీద పట్టింపు లేదని మా వయసు వారు అనుకుంటున్నామని, కానీ అది నిజం కాదని వారికి మాకంటే ఎక్కువ నమ్మకం, దేశంపట్ల మాకంటే ఎక్కువ ప్రేమ ఉందని మొన్నటి ఢిల్లీ ఉద్యమంతో తేలిపోయిందన్నారు. కాక్రోచ్ ఉద్యమాన్ని మీడియా పట్టించుకోలేదని, చివరకు నాన్ బయోలాజికల్ అని చెప్పుకునే వారి మెడలు వంచారంటే అది మామూలు విషయం కాదన్నారు. ఇది ప్రధాన ప్రతిపక్షాలుగా మేము చేయలేని పనిని ఈ దేశ యువత చేసి చూపించి మాకు ఓ దారి చూపించాయని చెప్పారు.
KTR Gen Z Protest | సోషల్ మీడియా పాత్ర..
ట్రెడిషనల్, మెయిన్‌స్ట్రీమ్ మీడియాను ప్రభుత్వాలు మేనేజ్ చేశాయని, సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాలలో చలనం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. సోషల్ మీడియాకు హద్దులు ఉండాలని కొంతమంది మాట్లాడుతున్నారని, కానీ ఈ పరిమితులు నియమించేది ప్రభుత్వాలా అని నిలదీశారు. స్వేచ్ఛకు హద్దులు పెడితే అది వాక్ స్వాతంత్ర్యం ఎలా అవుతుందని, స్వేచ్ఛ అంటే బూతులతో మాట్లాడటం కాదన్నారు.
KTR Gen Z Protest | రాజకీయ విమర్శలు..
పొరుగు రాష్ట్రం తమిళనాడులో మన సీఎం మాట్లాడితే అదే కార్యక్రమంలో ఉన్న తాను మన సీఎం మాటను సమర్థిస్తూ మాట్లాడానని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం మా రక్తం కావాలంటూ మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. మా భాష కాదు రేవంత్ రెడ్డి భాషను అదుపులో పెట్టుకోమని చెప్పాలని ఇదే కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. మీడియాను మేనేజ్ చేయడం ద్వారా ప్రజల్లో నెరేటివ్ డ్రైవ్ చేయవచ్చని ప్రభుత్వాలు భావిస్తాయని, ప్రశాంత్ కిశోర్ లాంటి వారు ఇదే చెబుతున్నారని, కానీ ఢిల్లీలో జరిగిన ఆందోళనలు సంప్రదాయ మూసపద్ధతుల ఆలోచనలకు భిన్నంగా యువతరం కదం తొక్కడానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు.
ఢిల్లీలో జరిగిన ఒక కొత్త తరహా ఆందోళన వల్ల కేవలం ప్రభుత్వం మాత్రమే వణకలేదు.. మీడియాకు కూడా చెమటలు పట్టాయి.. భజన మీడియా బల్బులు ఎగిరిపోయాయి.. పిల్లలు గోదీ మీడియాను నిలదీశారు.
వాళ్ళు దేనికి భయపడే బ్యాచ్ కాదు.. మోదీ ఎవరితోనైతే పెట్టుకోవొద్దో వాళ్ళతోనే పెట్టుకున్నాడు.
మొన్న జరిగిన… pic.twitter.com/vNPk21woPS
— Mission Telangana (@MissionTG) August 1, 2026
ఇది కూడా చదవండి: MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్పాల్