Banswada Stray Dogs | వీధి కుక్కల బెడదపై అధికారుల ప్రత్యేకచర్యలు

బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Stray Dogs | పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్లపై సంచరించేందుకు భయపడే పరిస్థితి నెలకొంది.

Banswada Stray Dogs | ఇటీవల 12మందికి గాయాలు..

ఇటీవల పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు దాడి చేయడంతో సుమారు 12 మంది గాయపడిన సంఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో సమస్యను అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న బాన్సువాడ మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజ్ (Kasula Vijaya Balaraj) ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పర్యవేక్షణలో శనివారం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Banswada Stray Dogs | బోన్లు, వలలు..

బోనులు, వలలు, అవసరమైన పరికరాలతో కూడిన సిబ్బంది పట్టణంలోని వివిధ కాలనీలు, ప్రధాన రహదారులు, విద్యాసంస్థల పరిసరాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించారు. అనంతరం వాటిని పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టుబడిన కుక్కలను భద్రంగా తరలించి అటవీ ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగించి పట్టణంలోని అన్ని వార్డుల్లో వీధికుక్కల సమస్యను పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎక్కడైనా కుక్కల గుంపులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు. వీధి కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ చర్యలను స్వాగతిస్తూ, పట్టణమంతటా ఇదే తరహా చర్యలు నిరంతరం కొనసాగించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *