అక్షరటుడే వెబ్‌డెస్క్: E20 Fuel Issue | పెట్రోల్ బంకుల్లో ఈ20 ఇంధనం లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఏది కావాలనేది ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) కోరారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ20 మిశ్రమ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
E20 Fuel Issue |వాణిజ్య ఒప్పందంపై ఆరోపణలు..
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగానే పౌరులపై ఈ20 ఇంధనాన్ని ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనివల్ల ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ ఇంధనం వాహనాలకు ఎలాంటి నష్టం కలిగించదని ప్రభుత్వం చెబుతున్న అధ్యయన నివేదికలను వెంటనే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. మిశ్రమ ఇంధనానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతి పత్రం సమర్పించేందుకు ఆగస్టు 4న ఆయన నివాసం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్పాల్