Prashna Ravan Case | యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ కేసు.. గన్నవరం కోర్టులో నేడు కీలక విచారణ

ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' (బచ్చలకూరి జోసెఫ్) కేసులో గన్నవరం కోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Prashna Ravan Case | ప్రముఖ యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ (బచ్చలకూరి జోసెఫ్) కేసులో గన్నవరం కోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. దేశద్రోహం కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న జోసెఫ్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రావణ్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంతో, కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Prashna Ravan Case | కీలక ఆధారాలు..

ఇటీవల హైదరాబాద్ ( Hyderabad ) సహా పలు ప్రాంతాల్లో రావణ్ నివాసాల్లో పోలీసులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆయన భార్య స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు విషయాలను రాబట్టేందుకు తమ కస్టడీ అవసరమని పోలీసులు కోర్టును కోరారు.

ravan.1

Prashna Ravan Case | షాకింగ్ విషయాలు..

యూట్యూబర్ రావణ్ కేసుపై పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌లో పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేషం కలిగించేలా వీడియోలు రూపొందించారని, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు, మావోయిస్టులకు మద్దతుగా రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించి, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. రావణ్ చేసిన ఈ విద్వేషపూరిత వీడియోల వెనుక సహకరిస్తున్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు లోతైన విచారణ అవసరమని పోలీసులు వివరించారు.

ఇది కూడా చదవండి: Rythu Bharosa Scheme | నేడు రైతు ఆశీర్వాద సభ.. రూ.వెయ్యి కోట్లు విడుదల చేయనున్న సీఎం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *