అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal Visits | నగరంలోని (Nizamabad) లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. శనివారం 42వ డివిజన్లోని చంద్రశేఖర్ కాలనీలో ఆయన పర్యటించారు.
MLA Dhanpal Visits | ఇల్లు కూలిన ఘటనలో..
ఎడతెరిపిలేని వర్షం కారణంగా చంద్రశేఖర్ కాలనీలోని షేక్ ఫిరోజ్ ఇల్లు కూలిపోవడంతో ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడితే అధికారులను, స్థానిక కార్పొరేటర్లను సంప్రదించాలన్నారు. సంబంధిత అధికారులు కూడా లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అనంతరం నెలవారి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బెల్లాల్ శశాంక్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.