Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప

గోదావరిలో ఆదివారం గంగపుత్రులకు భారీ చేప చిక్కింది. సుమారు 14 కేజీల బొచ్చ చేప దొరకడంతో హర్షం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, మెండోరా : Giant Fish Catch | జిల్లాలో మృగశిర కార్తె సందడి నెలకొంది. ఈ సందర్భంగా పండుగ రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చేపలకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది.

Giant Fish Catch | మెండోరా మండలంలో..

మండలంలో మృగశిల కార్తె (మిరుగు) సందర్భంగా చేపలకు గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో గోదావరి (Godavari)లో ఆదివారం గంగపుత్రులకు భారీ చేప చిక్కింది. సుమారు 14 కేజీల బొచ్చ చేప దొరికింది. దీంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేశారు. రూ. 300 కిలో చొప్పున ఈ చేపను విక్రయించారు. తాము నీటి వనరులమీదే బతుకుతున్నామని.. నీళ్లున్నప్పుడే తాము జీవనోపాధి పొందుతున్నామని.. వర్షాలు లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు ఉమేష్, కార్యదర్శి లక్కంపల్లి రాజేందర్ పేర్కొన్నారు.

mirgam

దీనిని కూడా చదవండి : CCTV Surveillance | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: సీపీ సాయిచైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *