AI Soft Robots | పైపుల్లో ఈదుతూ లీకేజీలు గుర్తించే ‘ఏఐ రోబోలు’.. ఈల్ చేపల స్ఫూర్తితో క్రేజీ రీసెర్చ్

రోబోటిక్ టెక్నాలజీ అనగానే మనకు సాధారణంగా మనుషుల్లా నడిచే హ్యూమనాయిడ్లు లేదా ఫ్యాక్టరీలలో పనిచేసే భారీ యంత్రాలు మాత్రమే గుర్తుకువస్తాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: AI Soft Robots | రోబోటిక్ టెక్నాలజీ అనగానే మనకు సాధారణంగా మనుషుల్లా నడిచే హ్యూమనాయిడ్లు లేదా ఫ్యాక్టరీలలో పనిచేసే భారీ యంత్రాలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ, ఇప్పుడు మానవ అవసరాల కోసం సరిహద్దులను దాటి సరికొత్త పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే దక్షిణ కొరియాకు ( South Korea ) చెందిన సాంకేతిక నిపుణులు.. భూగర్భంలో, భవనాలలో ఉండే పైప్‌లైన్ల అంతర్గత సమస్యలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చిన్న సాఫ్ట్ రోబోలను తయారు చేస్తున్నారు.
robo

 

AI Soft Robots | ‘ఈల్’ చేపల స్ఫూర్తితో..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న పైప్ ఇన్‌స్పెక్షన్ రోబోల వల్ల పెద్ద సమస్యే ఉంది. పైపుల్లో ఎక్కడైనా బ్లాక్ అయినా లేదా లీక్ అయినా.. రోడ్లను, నేలను భారీగా తవ్వి ఆ ప్రదేశాన్ని ఇన్‌స్పెక్షన్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల సమయంతో పాటు ప్రజా ధనం, వనరులు తీవ్రంగా వృథా అవుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు నీటిలో ఈదే ‘ఈల్’ (ఒక రకమైన చేప) శరీర నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సాఫ్ట్ రోబోలను డిజైన్ చేశారు. ఇవి చాలా మెత్తని పదార్థాలతో తయారవడం వల్ల ఇరుకైన, వంకరగా ఉన్న , వ్యర్థాలతో నిండిపోయిన పైపుల్లో కూడా ప్రవాహానికి అనుగుణంగా తమ ఆకారాన్ని మార్చుకుంటూ సులభంగా ముందుకు సాగగలవు.

AI Soft Robots | పగుళ్లు, లీకేజీలను పట్టేస్తాయి..

మానవులు వెళ్ళడానికి వీల్లేని, అత్యంత ప్రమాదకరమైన భూగర్భ గ్యాస్, వాటర్, ఇండస్ట్రియల్ పైప్‌లైన్లలో ఈ స్మార్ట్ రోబోలు అద్భుతంగా పనిచేస్తాయి. పాతగా అయిన పైపుల లోపల ఏర్పడే అతిచిన్న పగుళ్లను, గ్యాస్ లేదా వాటర్ లీకేజీలను ఇవి స్వయంగా గుర్తించి తక్షణమే సమాచారాన్ని అందిస్తాయి. దీనివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా ముందే అడ్డుకోవచ్చు.
robo.1 1

AI Soft Robots | ఏఐ సెన్సార్లు, కెమెరాలతో రిపేరింగ్..

ఈ బుల్లి సాఫ్ట్ రోబోలలో అత్యాధునిక ఏఐ సెన్సార్లు, హై-రిజల్యూషన్ కెమెరాలతో పాటు చిన్నపాటి రిపేరింగ్ టూల్స్‌ను కూడా అమర్చారు. ఇవి పైపుల లోపలి అసలు పరిస్థితిని స్పష్టమైన విజువల్స్ ద్వారా లైవ్‌లో తెలియజేయడమే కాకుండా, లీకేజీలను వెంటనే రిపేర్ చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రస్తుతం ఈ సరికొత్త టెక్నాలజీ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నగరాల్లో నీటి వృథాను అరికట్టడానికి, మౌలిక వసతుల సంరక్షణకు ఇదొక గేమ్ ఛేంజర్ కానుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *