Future City Project | ఫ్యూచర్​ సిటీని రద్దు చేస్తే బండకేసి కొడతారు : సీఎం రేవంత్​

ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామంటే ప్రజలు బండకేసి కొడతారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Future City Project | ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామని అమెరికా వెళ్లి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. భవిష్యత్‌ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి భవిష్యత్ ఉండదన్నారు.

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి సంస్థ (FCDA) భవనాన్ని సీఎం బుధవారం ప్రారంభించారు. FCDA లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ను కులీకుతుబ్‌షా, నిజాంలు విస్తరించారన్నారు. దాంతో నగరానికి ప్రపంచ గుర్తింపు వచ్చిందని తెలిపారు. నాడు హైటెక్‌ సిటీ అంటే నవ్వారు, ఔటర్‌ రింగు రోడ్డును అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు అభివృద్ధి జరగొద్దని కుట్రలు కుతంత్రాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఫ్యూచర్‌ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

cm revanth 4

Future City Project | ప్రతిపక్ష హోదా కూడా రాదు

పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసులు కలిసి ‘ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తారట అని సీఎం అన్నారు. రద్దైన 1000 నోటు లాంటివాళ్లు అని బీఆర్​ఎస్​ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వారికి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు.

Future City Project | ఇదేనా అభివృద్ధి

హైదరాబాద్​ (Hyderabad)లో నిన్న 2 గంటల వానకే రోడ్లపై నీరు నిలిచిపోయిందని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ నగరం అని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు.. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి అని ప్రశ్నించారు. రోడ్లపై వరద పారుతుంటే ఎవరిది బాధ్యత అన్నారు. గత పాలకుల ఆక్రమణల వల్లే.. చెరువులు, కుంటల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్ల మీదకు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు. ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : NBK 111 Glimpse | మాస్​ లుక్​లో అదరగొట్టిన బాలకృష్ణ.. ఎన్​బీకే 111 గ్లింప్స్​ రిలీజ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *