Beedi Thekedars | డిపాజిట్లు తిరిగి ఇచ్చేయాలి.. బీడీ టేకేదార్ల డిమాండ్

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి: Beedi Thekedars | చార్ బై కంపెనీ నుంచి తమకు రావాల్సిన డిపాజిట్లు తక్షణమే ఇవ్వాలని బీడీ టేకేదార్లు డిమాండ్ చేశారు. కామారెడ్డి పర్ణిక ప్యాలెస్​లో తెలంగాణ బీడీ కమిషన్ ఏజెంట్స్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రస్థాయి బీడీ టేకేదార్ల సమావేశం నిర్వహించారు.

Beedi Thekedars | రూ.10 కోట్ల వరకు రావాల్సి ఉన్నా..

సమావేశంలో బీడీ కంపెనీల యాజమాన్యాలతో తమ సమస్యలపై టేకేదార్లు చర్చించారు. ఈ సందర్భంగా టేకేదార్లు మాట్లాడుతూ.. తాము కార్ఖానా కోసం చేసిన డిపాజిట్, బిల్డింగ్ డబ్బులు కలిపి మొత్తం రూ.10 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. కార్ఖానాలు ఖాళీ చేసి యాజమాన్యాలకు అప్పగించిన వెంటనే డిపాజిట్ అమౌంట్ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. సమస్యలపై మాట్లాడటానికి కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్తే గేటు కూడా దాటనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డిపాజిట్లు ఇచ్చేస్తే ఇతర ఉపాధి మార్గాలు చూసుకుంటామన్నారు. వెంటనే తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో టేకేదార్​కు రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు రావాల్సి ఉందని తెలిపారు. తమ ఉపాధిని దృష్టిలో ఉంచుకుని డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ ఆంజనేయులు, టేకేదార్ల జేఏసీ నాయకుడు గంగా చరణ్, గంగాధర్, పోశెట్టి, సుమారు 150 మంది టేకేదార్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Shabbir Ali | అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం..: షబ్బీర్ అలీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *