Cattle Smuggling surveillance | పశువుల అక్రమ రవాణాపై పక్కాగా నిఘా ఉంచాలి..: సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా/ముప్కాల్/బాల్కొండ: Cattle Smuggling surveillance | బక్రీద్(Bakrid) పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై పక్కాగా నిఘా ఉంచాలని సీపీ సాయిచైతన్య(cp sai chaitanya) పేర్కొన్నారు. మెండోరా(Mendora) పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్‌గాం ఇంటర్-డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్‌పోస్ట్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Cattle Smuggling surveillance | సిబ్బంది సూచనలు..

చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సీపీ సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల గుండా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించారు. వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బ్యారికేడ్లు, హెచ్చరిక లైట్లను వినియోగించడం, వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Cattle Smuggling surveillance | పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం పరిశీలన

cp3

ముప్కాల్(mupkal) మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ పనులను సీపీ పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, సౌకర్యాల ఏర్పాట్లపై అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ నిర్మించాలని సూచించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, ముప్కాల్ ఎస్సై కిరణ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

Cattle Smuggling surveillance | బస్సాపూర్‌లో 18 సీసీ కెమెరాల ప్రారంభం

cp2

బాల్కొండ(Balkonda police) పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్సాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 18 సీసీ కెమెరాలను సీపీ సాయిచైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, నేరాల నివారణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ముఖ్యంగా నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బస్సాపూర్ గ్రామంలో 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖకు సహకరించిన గ్రామపంచాయతీని కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై శైలేందర్, బస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సర్పంచ్ ఎర్రన్న, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: OPPO A6c 5G |  తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *