అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad)లోని పలు ప్రాంతాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయి. అమీర్‌పేట, టోలిచౌకి, నానల్‌నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తామని పోలీసులు తెలిపారు.
అమీర్‌పేట్‌లోని మైత్రివనం జంక్షన్లో ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని (NTR Statue) గురువారం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. విగ్రహావిష్కరణ, బహిరంగ సభ జరగనున్న దృష్ట్యా మే 27 రాత్రి 10 గంటల నుండి మే 28 రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Traffic Restrictions | వాహనాల మళ్లింపులు
అమీర్‌పేట/ సత్యం థియేటర్ / SR నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలు, వెంగల్రావునగర్ – కళ్యాణ్ నగర్ – కృష్ణ కాంత్ పార్క్ మీదుగా వెళ్లాలి. యూసుఫ్‌గూడ బస్తీ, రహమత్ నగర్ నుంచి మైత్రివనం వైపు వచ్చే వాహనాలను, మే 28న మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్య మళ్లిస్తారు. యూసుఫ్‌గూడ బస్తీ, అల్-సబా హోటల్ మధ్య ఉన్న అంతర్గత దారులలో (bylanes) కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి.

Traffic Restrictions | బక్రీద్ నేపథ్యంలో..
బక్రీద్ (Bakrid) సందర్భంగా మే 27, 28 తేదీల్లో మేకలు, గొర్రెల విక్రయ కార్యకలాపాల కారణంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని పోలీసులు తెలిపారు. టోలిచౌకి, నానల్ నగర్, రేతిబౌలి, అత్తాపూర్ రోడ్డులో ట్రాఫిక్ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బుధవారం సాయంత్రం 5 గంటల నుండి గురువారం ఉదయం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు. గచ్చిబౌలి/రాయదుర్గం నుంచి మెహదీపట్నం వెళ్లే వారు ఫిల్మ్‌నగర్, బృందావన్‌కాలనీ మార్గాలను ఉపయోగించాలి. లక్డికాపుల్ నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ మీదుగా మళ్లించారు. మసబ్ ట్యాంక్– అత్తాపూర్ ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే సర్వీస్ మార్గాన్ని ఉపయోగించుకోవాలి. ప్రైవేట్ బస్సులు రాత్రి వేళల్లో మెహదీపట్నం–టోలిచౌకి మార్గాన్ని తప్పించి, ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలి.
Traffic Restrictions | ప్రార్థనల కోసం..
బక్రీద్ సందర్భంగా మే 28న మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా వద్ద బక్రీద్ ప్రార్థనల దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు అమలులో ఉంటాయి. బహదూర్‌పురా, తద్బాన్, మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా, కాలాపత్తర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
దీనిని కూడా చదవండి : One Hyd Park | హైదరాబాద్‌లో స్మార్ట్ హోమ్స్.. స్నైడర్ ఎలక్ట్రిక్ బిగ్ పార్టనర్షిప్


