One Hyd Park | హైదరాబాద్‌లో స్మార్ట్ హోమ్స్.. స్నైడర్ ఎలక్ట్రిక్ బిగ్ పార్టనర్‌షిప్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: One Hyd Park | హైదరాబాద్‌లోని ప్రముఖ లగ్జరీ నివాస ప్రాజెక్ట్ ‘వన్ హైడ్ పార్క్’ (One Hyd Park) లో అత్యాధునిక, విలాసవంతమైన జీవన శైలిని అందించేందుకు గ్లోబల్ డిజిటల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సంస్థ ‘స్నైడర్ ఎలక్ట్రిక్’ (Schneider Electric) చేతులు కలిపింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఇళ్లను ఇంటెలిజెంట్ ఆటోమేషన్, అత్యుత్తమ ఇంధన సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరింది.

One Hyd Park | దాదాపు 20% విద్యుత్ ఆదా..

ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌లో స్నైడర్ ఎలక్ట్రిక్ తన అధునాతన స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్‌ను అమర్చింది. ఇందులో భాగంగా వ్యక్తిగత ఫ్లాట్లు, కారిడార్లు, ఉమ్మడి ప్రాంతాలు , క్లబ్‌హౌస్‌లలో ఇంటెలిజెంట్ లైటింగ్ కంట్రోల్స్ (DALI డిమ్మింగ్), సందర్భానికి తగ్గట్టుగా లైట్లు మారేలా సీన్-బేస్డ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ కర్టెన్ మోటార్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు అధునాతన క్లైమేట్ కంట్రోల్ (VRV/VRAC) సిస్టమ్స్, ఈజీ ఆపరేషన్ కోసం స్మార్ట్ టచ్ డిస్‌ప్లేలు , ప్రత్యేక సెన్సార్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆటోమేషన్ టెక్నాలజీల వల్ల ‘వన్ హైడ్ పార్క్’లో దాదాపు 20 శాతం వరకు విద్యుత్ ఆదా (Energy Savings) అవుతుండటం విశేషం. హోమ్ ఓనర్స్ నుండి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి, ఈ స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్‌ను క్లబ్‌హౌస్ , కమ్యూనిటీ స్పేసెస్‌కు కూడా విస్తరించారు.

hyd 2

One Hyd Park | టెక్నాలజీతో కూడిన లగ్జరీ లైఫ్..

ఈ భాగస్వామ్యంపై స్నైడర్ ఎలక్ట్రిక్ ప్రతినిధి మాట్లాడుతూ.. “ప్రస్తుత కాలంలో లగ్జరీ లివింగ్ అంటే కేవలం అందమైన భవనాలు, డిజైన్లు మాత్రమే కాదు; మనం ఉండే ఇల్లు మన అవసరాలకు తగ్గట్టుగా ఎంత స్మార్ట్‌గా స్పందిస్తోందనేది ముఖ్యం. సాంకేతికత బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ, నిత్య జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేలా మా హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ పనిచేస్తాయి” అని పేర్కొన్నారు. హెచ్‌పి లఖానీ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, ప్రిన్సిపల్ డిజైనర్ హరేష్ లఖానీ మాట్లాడుతూ.. “ఇంటిలో సాంకేతికత అనేది ఇబ్బందికరంగా ఉండకూడదు, అది జీవన అనుభవాన్ని మరింత పెంచాలి. స్నైడర్ ఎలక్ట్రిక్ వారి ‘స్పేస్‌లాజిక్ కెఎన్ఎక్స్’ (SpaceLogic KNX) సిస్టమ్ చాలా అద్భుతంగా, సులువుగా అలవాటుపడేలా ఉంది. ఇది ఇళ్లకు అధునాతనమైన, సౌకర్యవంతమైన లుక్‌ను ఇస్తుంది” అన్నారు.

ఎడోమోటిక్స్ (EDOMOTICS) కో-ఫౌండర్ , సీఈఓ గణేష్ వుడుత మాట్లాడుతూ.. “హోమ్ ఆటోమేషన్ అనేది ఇప్పుడు కేవలం లగ్జరీ ఫీచర్ కాదు, ఆధునిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. వన్ హైడ్ పార్క్‌లో నివసించే వారికి నమ్మకమైన, సులువైన , విలాసవంతమైన అనుభూతిని ఇవ్వడానికే స్మార్ట్ లైటింగ్, క్లైమేట్ , కర్టెన్ ఆటోమేషన్‌లను అనుసంధానించాం” అని తెలిపారు.

hyd.1 ఇది కూడా చదవండి: Electric Buses | ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *