Capacitor Theft | అన్నదాతలకు దొంగల భయం..

అరుగాలం కష్టించే రైతులకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పొలాల వద్ద కెపాసిటర్లు, బోర్లు, వైర్లు ఎత్తుకెళ్తున్నారు.

shashi kiran Mottala

గాంధారి, అక్షరటుడే: Capacitor Theft | ఆరుగాలం కష్టించే రైతులకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పొలాల వద్ద కెపాసిటర్లు(capacitor), బోర్లు, వైర్లు ఎత్తుకెళ్తూ వారిని ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లతో ఇబ్బందులు పడుతున్న రైతులకు చోరీల రూపంలో మరింత నష్టాన్ని కలిగిస్తున్నారు.

Capacitor Theft | గాంధారి మండలంలో..

పండించిన పంటకు మద్దతు ధర రాక ఇబ్బందులు పడ్డప్పటికీ రైతు మళ్లీ ఆ భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తుంటాడు. అలాంటి రైతులను దొంగలు ఆర్థికంగా మరింత ఇబ్బందులు పెడుతున్నారు. వ్యవసాయ మోటార్ల వద్ద  ఉండే కెపాసిటర్లను ఎత్తుకెళ్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని (gandhari farmers) తిప్పారంనకు వెళ్లే దారిలో పత్తి శ్రీకాంత్, బాలయ్యకు మూడెకరాల పొలం ఉంది. అందులో ఒక బోరు మోటార్​ ఉండగా.. అదే శివారులో దేశ్​పాండే రాకేష్​కు రెండెకకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగూ పత్తి నర్సింలుకు మూడు ఎకరాల సాగు భూమి ఉంది. ఇలా ఇదే శివారులో మరికొందరికి పొలాలు ఉండగా..దొంగలు బోర్ల కేబుల్​ వైర్లను ఇటీవల చోరీ చేశారు. దీనికి సంబంధించి రైతులు పోలీస్​స్టేషన్​లో(gandhari  Police station) ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని వారు ఆరోపిస్తున్నారు.

Capacitor Theft | ఆరుసార్లు చోరీ..

తిప్పారం శివారులో ఉన్న పొలాల్లో ఇప్పటికే దొంగలు ఆరుసార్లు చోరీలకు పాల్పడ్డారు. చోరీ జరిగిన ప్రతి సారి పొలాలకు నీళ్లు పారకపోతే ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో రైతులు కొత్త కెపాసిటర్లు, వైర్లు బిగించుకుంటున్నారు. దొంగలు మాత్రం పదేపదే చోరీలు పాల్పడుతూ పోలీసులకు సవాల్​ విసురుతున్నారు.

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాం..

persomn

– పత్తి శ్రీకాంత్, రైతు

వరుసగా ఆరు దొంగతనాలు జరిగితే పోలీస్ స్టేషన్​లో కూడా ఫిర్యాదు ఇచ్చాం. కానీ ఎలాంటి చర్యలు కనిపించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆరుకాలం శ్రమించి పండించిన పంటకు కాపాడుకోలేకపోతున్న తరుణంలో ఈ మోటార్ కేబుల్, కెపాసిటర్ల చోరీలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: MPDO MPO ACB Trap | ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీవో

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *