Harish Rao Demand | అధికార మత్తులో కాంగ్రెస్.. హిట్లర్ పాలనను అంతం చేస్తాం: హరీశ్ రావు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Demand | కాంట్రాక్టర్ల బిల్లులను ఆపి, ఆ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao ) డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Harish Rao Demand |రైతుబంధు ఎక్కడ?

గత ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధును క్రమం తప్పకుండా అందించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల రైతుబంధు నిధులను ఎగ్గొట్టి రుణమాఫీ చేశామంటూ తప్పుదోవ పట్టిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ‘రైతు బీమా’ పథకం ఇప్పుడు ఆగిపోయిందని, ఒకవేళ రైతు చనిపోతే ఆ కుటుంబానికి దిక్కులేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

harish.1

Harish Rao Demand |వ్యవసాయ సంక్షోభం..

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా గాలిలో కలిసిందని, రైతులు తమ పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, కనీసం వడ్ల సంచులు కూడా అందుబాటులో లేవని ఆయన ఆరోపించారు.రూ. 100 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీసుల నిర్మాణం, అందాల పోటీలు, ఫుట్‌బాల్ ఈవెంట్లకు నిధులు ఉన్నప్పుడు.. రైతుల సంక్షేమానికి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, మహిళల పింఛన్లకు నిధులు ఎందుకు లేవని రేవంత్ రెడ్డిని నిలదీశారు.

Harish Rao Demand | ఇది హిట్లర్ పాలన..

అధికార మత్తులో ఉన్న కాంగ్రెస్ సర్కారు రైతులను, పేదలను విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు ‘హిట్లర్ పాలన’ను గుర్తు చేస్తోందని, ప్రజలు ఈ అరాచక పాలనను అంతం చేయడానికి సిద్ధమయ్యారని ఆయన జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని, మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Singareni Medical Board | సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *