తెలంగాణBandi Sanjay Statement | నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : బండి...

Bandi Sanjay Statement | నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : బండి సంజయ్​

కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడాల్సిందే అన్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Statement | కేంద్ర మంత్రి బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడాల్సిందే అన్నారు. అయితే తన కుమారుడు ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడని చెప్పారు. అయినా ఒక క్రిమినల్​గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హనుమాన్​ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం కరీంనగర్​ (Karimnagar)లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్​ మాట్లాడారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసు (pocso case)పై స్పందించారు. ‘ఏ తప్పు చేయలేదు.. స్నేహంగా ఉన్నామంటున్నాడు నా కొడుకు..! కానీ బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు’ అని బండి సంజయ్​ అన్నారు. తన కుమారుడిని సమర్థించట్లేదని పేర్కొన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని తెలిపారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.

Bandi Sanjay Statement | కన్న పేగు తల్లడిల్లుతోంది

తన కుమారుడిపై దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోందని కేంద్ర మంత్రి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెప్పారు. తన కుమారుడికి టైమ్ ఇవ్వలేదని, దానికి తప్పు తనదే అన్నారు. తన జీవితంలో ఏ రోజు ఎంజాయ్​ చేయలేదని చెప్పారు. పార్టీ జెండా ఏ రోజు పట్టుకున్నానో అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ తన కుటుంబంపై ఈ రోజు కొందరు రాళ్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయలేదని, బయటకు వస్తానని తన కొడుకు మాట ఇచ్చాడన్నారు. అతడు నిజంగా తప్పు చేస్తే క్షమించనని స్పష్టం చేశారు.

Bandi Sanjay Statement | వారిని విడిచి పెట్టను

కుట్రలు, కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారున పడేశారో వారిని విడిచిపెట్టనని బండి సంజయ్​ హెచ్చరించారు. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినట్లు మీరు పెట్టిన ఈ నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దహనం చేస్తానన్నారు. తన గుండె మీద కాషాయం జెండా ఉందని, తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయన్నారు.

ఇది కూడా చదవండి : Paddy Farmers | ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: T-SAT Education Department | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్...

లక్డీకాపూల్ గ్లెనీగిల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేబర్ సూట్ ప్రారంభం

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లెనీగిల్స్ హాస్పిటల్స్ (ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్) మహిళల ఆరోగ్య...

Indalwai Checkpost Inspection | ఇందల్వాయి చెక్​పోస్ట్​ వద్ద సీపీ సాయిచైతన్య ఆకస్మిక తనిఖీలు

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Indalwai Checkpost Inspection | పశువుల అక్రమ...

Illegal Cattle Transport | పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Illegal Cattle Transport | పశువుల అక్రమ...