అక్షరటుడే, హైదరాబాద్ : Hyderabad Drugs Case | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై పోలీసులు నిర్వహిస్తున్న ఉక్కుపాదం దాడులు కీలక మలుపు తిరిగాయి. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మెరుపు దాడుల్లో ఒక ప్రముఖ ఎమ్మెల్సీ కుమారుడు భరత్ డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కడం నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Hyderabad Drugs Case | పోలీసుల ప్రత్యేక బృందాలు నిఘా ..
నగరంలో రహస్యంగా డ్రగ్స్ నెట్వర్క్ నిర్వహిస్తున్న ముఠాలపై పోలీసుల ప్రత్యేక బృందాలు నిఘా ఉంచాయి. పక్కా సమాచారంతో చేపట్టిన సోదాల్లో, డ్రగ్స్ విక్రయాలు , వినియోగంతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కుమారుడు భరత్ కూడా డ్రగ్స్ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నాడని, స్వయంగా పాల్గొంటున్నాడని ప్రాథమికంగా గుర్తించి అరెస్టు చేశారు.
Hyderabad Drugs Case | పోలీసుల విచారణ ముమ్మరం..
ఈ డ్రగ్స్ రాకెట్లో ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరికొంతమంది బడా బాబుల పిల్లల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మాదకద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి వెనుక ఉన్న అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఎంతవరకు ఉంది? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కుమారుడు కేసులో ఇరుక్కోవడంతో, పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Religious Teachings Schools | స్కూళ్లలో మతపరమైన బోధనలు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్