Ghatkopar Railway Station | రైల్వే స్టేషన్​లో ఘోరం.. వృద్ధురాలిపై అత్యాచారం

ముంబైలోని ఘాట్‌కోపర్ రైల్వే స్టేషన్‌లో వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ghatkopar Railway Station | ముంబైలోని ఘాట్‌కోపర్ రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి ఒక 60 ఏళ్ల మహిళపై దారుణం జరిగింది. ఆమె బహిరంగ మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో, ఒక వ్యక్తి ఆమెను వెంబడించి, తీవ్రంగా కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లా ఖదావ్లీ ప్రాంతానికి చెందిన బాధితురాలు తన కుమార్తెతో కలిసి రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘాట్‌కోపర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. లోకల్ రైలు కోసం వేచి ఉన్న సమయంలో, ఆ మహిళ మరుగుదొడ్డికి వెళ్లింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆమెను రహస్యంగా అనుసరిస్తూ మరుగుదొడ్డిలోకి ప్రవేశించి, ఆమెపై దాడి చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

Ghatkopar Railway Station | తీవ్రగాయాలు

తీవ్ర గాయాలతో, రక్తమోడుతున్న స్థితిలో బయటకు వచ్చిన బాధితురాలు, జరిగిన దారుణాన్ని తన కుమార్తెకు చెప్పింది. వెంటనే ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కుర్లా జీఆర్పీ పోలీసులు అతడిని పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని 27 ఏళ్ల తస్లీమ్ నూర్ మహమ్మద్ షాగా గుర్తించారు.

ఇది కూడా చదవండి..: BJP MP Lakshmi Verma | రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎంపీకి గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *