అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP MP Lakshmi Verma | రోడ్డు ప్రమాదంలో బీజేపీ రాజ్యసభ ఎంపీకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
రాయ్‌పూర్ జిల్లా (Raipur District)లో బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మీ వర్మ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు శనివారం ఉదయం పోలీసులు తెలిపారు. బలోదాబజార్-భటాపారా జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా
ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఎంపీతో పాటు ఆమె కుమారుడు, భద్రతా సిబ్బంది ఉన్నారు.
BJP MP Lakshmi Verma | ఎయిమ్స్‌కు తరలింపు
ఈ ప్రమాదంలో ఎంపీ లక్ష్మీ వర్మ, ఆమె కారు డ్రైవర్ గాయపడ్డారు. అలాగే మరో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. లక్ష్మీ వర్మను రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె కుడి చేయి విరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, లక్ష్మీ వర్మ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి..: Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు