Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు

డీలిమిటేషన్​ బిల్లుకు డీఎంకే పార్టీ మద్దతు తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delimitation Bill | డీలిమిటేషన్​ బిల్లు వేళ దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమికి షాక్​ ఇస్తూ.. డీఎంకే పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం (Central Government) ఏప్రిల్​లో డీలిమిటేషన్​ బిల్లు ప్రవేశ పెట్టగా.. బలం లేకపోవడంతో వీగిపోయింది. దీంతో తాజాగా కొన్ని సవరణలతో మరోసారి బిల్లును ప్రవేశ పెట్టేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలో గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన డీఎంకే ఇప్పుడు మద్దతు తెలిపింది. ఇప్పటికే శరద్​ పవార్​ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం మద్దతు తెలిపింది. మరోవైపు టీఎంసీ చీలిక విభాగ ఎంపీలు సైతం బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.

Delimitation Bill | డీఎంకే తీర్మానం

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తూ డీఎంకే పార్టీ శనివారం తీర్మానం చేసింది. తాము 7.18 శాతం వాటా తగ్గొద్దని కోరామని, కేంద్రం దానికి మించి ఇచ్చిందని డీఎంకే పేర్కొంది. శనివారం ఉదయం జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ బిల్లుకు మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఏ. రాజా మాట్లాడుతూ, కొత్త డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఆ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నిర్ణయం గత ఏప్రిల్‌లో ఓడిపోయిన ఈ బిల్లును మళ్లీ ఆమోదింపజేయాలని భావిస్తున్న అధికార పక్షానికి అదనపు బలాన్ని చేకూర్చింది. ఈ బిల్లులో అన్ని రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే నిబంధనను కేంద్రం చేర్చడంతో డీఎంకే తన మద్దతును ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: Delimitation Bill | డీలిమిటేషన్​కు బిల్లుకు శరద్​ పవార్​ మద్దతు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *