Post Office Senior Citizen Schemes | పోస్టాఫీసు పథకాలతో దంపతులకు నెలకు రూ. 50 వేలకుపైగా ఆదాయం.. ఎలా సాధ్యమంటే?

పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత కోసం కూడబెట్టిన సొమ్మును సురక్షితమైన పథకాల్లో మదుపు చేయడం ఎంతో అవసరం.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Post Office Senior Citizen Schemes | పదవీ విరమణ  ( Retirement )అనంతరం ఆర్థిక భద్రత కోసం కూడబెట్టిన సొమ్మును సురక్షితమైన పథకాల్లో మదుపు చేయడం ఎంతో అవసరం. సాధారణ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచే బదులు, ప్రభుత్వ ఆధారిత పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మెరుగైన రాబడి పొందవచ్చు. ప్రస్తుతం దంపతులకు అత్యంత అనుకూలంగా ఉండే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) పథకాలు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ రెండు పథకాల వడ్డీ రేట్లు, పెట్టుబడి పరిమితులు, వచ్చే ఆదాయం వివరాలను చూద్దాం.

Post Office Senior Citizen Schemes | సేవింగ్స్ స్కీమ్ ..

60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ పథకంలో ఖాతా తెరిచేందుకు అర్హులు. దీనికి ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు అమల్లో ఉంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు జమ చేయవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ విడివిడిగా ఖాతాలు తెరిస్తే, కలిపి రూ. 60 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. 8.2 శాతం వడ్డీ ప్రకారం ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. ఇద్దరికీ కలిపి ఏడాదికి రూ. 4,92,000 ఆదాయం లభిస్తుంది. ఈ పథకంలో మూడు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేస్తారు. దీని ప్రకారం దంపతులకు ప్రతి త్రైమాసికానికి రూ. 1,23,000 అందుతుంది. దీనిని నెలవారీగా లెక్కిస్తే సగటున నెలకు రూ. 41,000 ఆదాయం వస్తుంది.

Post Office Senior Citizen Schemes | నెలవారీ ఆదాయం కోసం POMIS..

ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఉపయోగపడుతుంది. దీనికి ప్రస్తుతం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ (ఉమ్మడి) ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. భార్యాభర్తలు జాయింట్ ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తే, 7.4 శాతం వడ్డీ చొప్పున ఏడాదికి రూ. 1,11,000 వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని 12 నెలలకు విభజిస్తే నెలకు రూ. 9,250 చొప్పున ఆదాయం అందుతుంది.

Post Office Senior Citizen Schemes | మొత్తం రూ. 75 లక్షలు..

భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 60 లక్షలు, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ జాయింట్ ఖాతాలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం మదుపు రూ. 75 లక్షలు అవుతుంది. ఈ మొత్తం పెట్టుబడిపై ఏడాదికి రూ. 6,03,000 వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. దీనిని 12 నెలలకు సమానంగా పంచుకుంటే, సగటున నెలకు రూ. 50,250 ఆదాయం పొందే వీలుంటుంది.

ఇది  కూడా చదవండి: Ghatkopar Railway Station | రైల్వే స్టేషన్​లో ఘోరం.. వృద్ధురాలిపై అత్యాచారం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *