అక్షరటుడే వెబ్‌డెస్క్: Devi Vigyanam Movie | సైన్స్, హేతువాదం , ఆధ్యాత్మికతల మధ్య సంబంధాన్ని అన్వేషిస్తూ తెరకెక్కిన హిందీ డ్రామా చిత్రం ‘దేవి విజ్ఞానం’. కార్తవ్య షా దర్శకత్వంలో కింగ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు ( Hyderabad ) వచ్చిన చిత్ర బృందం.. గోషామహల్ ఎమ్మెల్యే టీ. రాజాసింగ్‌ను ప్రత్యేకంగా కలిసి సినిమా విశేషాలను పంచుకుంది.
Devi Vigyanam Movie | ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందనలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. “సినిమాలు సమాజంలోని విభిన్న అంశాల గురించి ప్రేక్షకులు ఆలోచించేలా చేయగలవు. ‘దేవి విజ్ఞానం’ ఇతివృత్తం ఎంతో ఆసక్తికరంగా ఉంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించాలి” అని ఆకాంక్షించారు.
Devi Vigyanam Movie | దర్శకుడి మాట..
డ్రామా, మిస్టరీ, భక్తి అంశాల కలయికగా రూపొందిన ఈ చిత్రం ఒక నాస్తికుడి కథను చెబుతుంది. ఊహించని సంఘటనల కారణంగా తాను బలంగా నమ్మిన సిద్ధాంతాలు ప్రశ్నార్థకం కాగా.. ఆ అనుభవాలు అతడిని కర్ణి మాత దైవిక శక్తిని కనుగొనే అసాధారణ ప్రయాణం వైపు నడిపించే కథాంశంతో ఇది తెరకెక్కింది. మనిషి దృక్పథం, విశ్వాసం, మానవ అవగాహనకు ఉన్న పరిమితుల గురించి ఈ సినిమా వివరిస్తుందని దర్శకుడు కార్తవ్య షా తెలిపారు.
Devi Vigyanam Movie | సాంకేతిక నిపుణులు..
ఈ చిత్రంలో చేతన్ ధనాని, కె. ఆర్యవర్ధన్, పూజా జోషి, టిక్కు తల్సానియా, మెహుల్ బుచ్, అలోక్ ఠాకర్, క్రుష్ దేబూ, నీలేష్ భట్ కీలక పాత్రల్లో నటించారు. హనుమాన్ మల్ తాటర్, లతేష్ సోనీ, అలోక్ ఠకర్, మన్మోహన్ రాఠీ నిర్మాతలుగా వ్యవహరించగా.. అభిషేక్ శర్మ, మోహిత్ శర్మ, విరల్ మెహతా సహ నిర్మాతలుగా, పృథ్వీ పాటిల్ రచయితగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: Maoist Dump Seized | కర్రెగుట్టల్లో మావోయిస్ట్ డంప్ స్వాధీనం