V-Rich Ginger Honey | వి-రిచ్ జింజర్‌ హనీ అద్భుతం.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు విస్తరణ..!

చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటిలోనూ అల్లం, తేనె వాడకం విపరీతంగా పెరుగుతుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: V-Rich Ginger Honey | చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటిలోనూ అల్లం, తేనె వాడకం విపరీతంగా పెరుగుతుంది. అయితే ప్రతిసారీ అల్లం తొక్క తీసి, ముక్కలు కోసి, దంచే శ్రమ లేకుండా నేరుగా వాడేలా ‘వి-రిచ్’ (V-Rich) సంస్థ సరికొత్త ‘జింజర్‌ హనీ’ని అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక క్లీన్-లేబుల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన వి-రిచ్.. తన ఉత్పత్తులను హైదరాబాద్ ( Hyderabad ), బెంగళూరు, చెన్నైతో సహా పలు ప్రధాన మెట్రో నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ హెల్తీ జింజర్‌ హనీ ప్రముఖ ఈ-కామర్స్ వేదికలైన అమెజాన్ (Amazon), బ్లింకిట్ (Blinkit) ద్వారా వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంది.

V-Rich Ginger Honey | ఈ జింజర్‌ హనీ ప్రత్యేకతలు ..

అసలైన తాజా అల్లం ముక్కలు: ఈ జార్‌ను తెరవగానే ప్రతి సీసాలోనూ చిన్న చిన్నగా కోసిన తాజా అల్లం ముక్కలు స్పష్టంగా కనిపిస్తాయి.

పూర్తిగా సహజమైనది: ఇందులో ఎలాంటి కృత్రిమ పొడులు, చక్కెర పాకం లేదా సింథటిక్ ఎక్స్‌ట్రాక్ట్స్‌ కలపలేదు. కేవలం స్వచ్ఛమైన తేనె, పచ్చి అల్లం కలయికతో దీన్ని తయారు చేశారు.

సమతుల్యమైన రుచి: అల్లం అందించే సహజమైన తాజా సువాసన, రుచికి.. స్వచ్ఛమైన తేనె తోడవడంతో ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.

ఎంతో సులభం: రోజూ వేడినీటిలో లేదా టీలో ఒక చెంచా ఈ జింజర్‌ హనీని కలుపుకుంటే చాలు, క్షణాల్లో అల్లం టీ సిద్ధమైపోతుంది.

వ్యవస్థాపకురాలు యోగిత జాహ్నవి ఏమన్నారంటే?
ఈ సందర్భంగా వి-రిచ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ యోగిత జాహ్నవి మాట్లాడుతూ.. “భారతీయ కుటుంబాలలో, ముఖ్యంగా చలికాలంలో అల్లం, తేనె అత్యంత కీలకమైన పదార్థాలు. అయితే ప్రతిసారీ తాజా అల్లాన్ని సిద్ధం చేయడం కష్టంతో కూడుకున్న పని. ఆ శ్రమ లేకుండా, అల్లం అసలైన సహజత్వాన్ని కోల్పోకుండా రోజువారీ జీవితంలో సులభంగా భాగం చేసుకునేలా ఈ జింజర్‌ హనీని రూపొందించాము. సాంప్రదాయ పదార్థాల ప్రామాణికతను కాపాడుతూ వినియోగదారులకు సౌకర్యాన్ని అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.

V-Rich Ginger Honey | ఎక్కడెక్కడ లభిస్తుంది?

ఈ జింజర్‌ హనీ 250ml , 500ml సైజులలో వి-రిచ్ అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుంది. దేశవ్యాప్త ఆర్డర్ల కోసం అమెజాన్‌లో అందుబాటులో ఉండగా.. హైదరాబాద్, బెంగళూరు నగరాల నివాసితులు బ్లింకిట్ ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే 250ml ప్యాక్‌లను వేగంగా పొందవచ్చు.

ఇది కూడా చదవండి:  Maoist Dump Seized | కర్రెగుట్టల్లో మావోయిస్ట్​ డంప్​ స్వాధీనం

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *