Shyam Metalics Alokmoy Kolkata | ఘనంగా ‘ఆలోకమయ్ కోల్‌కతా’ వేడుకలు.. ముఖ్య అతిథిగా మిథున్ చక్రవర్తి సందడి

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శ్యామ్ మెటాలిక్స్ సంస్థ కోల్‌కతా నగర వాసుల కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక వేడుకలను నిర్వహించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Shyam Metalics Alokmoy Kolkata | దీపావళి  ( Diwali ) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శ్యామ్ మెటాలిక్స్ సంస్థ కోల్‌కతా నగర వాసుల కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. నగరంలోని అక్రోపోలిస్ మాల్‌లో నవంబర్ 6 నుండి 9వ తేదీ వరకు ‘ఆలోకమయ్ కోల్‌కతా’ పేరుతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. కోల్‌కతా నగర ప్రత్యేకత, సంస్కృతి, కళాత్మక వైభవాన్ని ప్రతిబింబించేలా సంప్రదాయాలకు ఆధునికతను జోడించి ఈ వేడుకలను రూపొందించారు. నగర ప్రజలు పండుగ సంబరాల్లో అంతర్భాగం కావాలనే లక్ష్యంతో శ్యామ్ మెటాలిక్స్ ఈ అర్థవంతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Shyam Metalics Alokmoy Kolkata | ఆకట్టుకున్న ప్రత్యేక నిర్మాణాలు..

ఈ వేడుకల్లో భాగంగా SEL టైగర్ TMT బార్స్ బలాన్ని, రూఫింగ్ షీట్ల వైవిధ్యాన్ని చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన కళాఖండాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. SEL టైగర్ TMT బార్స్‌తో రూపొందించిన అందమైన దీపాల వృక్షం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే SEL టైగర్ రూఫింగ్ షీట్లతో కోల్‌కతా నగర వారసత్వ చిహ్నమైన ట్రామ్, సంప్రదాయ టాక్సీ నమూనాలను సృజనాత్మకంగా తయారు చేశారు. విద్యుద్దీపాలు, తోరణాల అలంకరణలతో కోల్‌కతా చారిత్రక ప్రత్యేకతను, శ్యామ్ మెటాలిక్స్ ఉత్పత్తుల సాంకేతిక సామర్థ్యాన్ని ఇవి స్పష్టంగా చాటిచెప్పాయి.

Shyam Metalics Alokmoy Kolkata | ఆకట్టుకున్న రంగోలి..

కేవలం అలంకరణలకే పరిమితం కాకుండా నగర ప్రజల భాగస్వామ్యానికి ఈ వేడుకల్లో పెద్దపీట వేశారు. తొలిరోజైన నవంబర్ 6న పూలతో రంగోలి (ఫూలోన్ కీ రంగోలి) కార్యక్రమంతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నవంబర్ 7న రంగోలి పోటీలు నిర్వహించగా, నవంబర్ 8న దీపాలంకరణ (దియా పెయింటింగ్) కార్యక్రమం చేపట్టారు. ఈ విభిన్నమైన సృజనాత్మక కార్యకలాపాలలో నగర ప్రజలు, మాల్ సందర్శకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.

Shyam Metalics Alokmoy Kolkata | మిథున్ చక్రవర్తి సందడి..

నవంబర్ 9న జరిగిన ముగింపు వేడుకలకు ప్రముఖ నటుడు, సాంస్కృతిక రంగ ప్రముఖుడు మిథున్ చక్రవర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. ఈ వేడుకల్లో నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేసి అభినందించారు. వ్యాపార కార్యకలాపాలతో పాటు సమాజంతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

సమాజంతో బంధాలకు దృఢత్వం ఇస్తాం: శ్యామ్ మెటాలిక్స్ సిఓఓ
ఈ సందర్భంగా శ్యామ్ మెటాలిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిర్మల్ ఉదయ్ మాట్లాడుతూ.. కోల్‌కతా అంటే కేవలం నగరమే కాదని, సంప్రదాయాలు, ఐక్యతా భావం మేళవించిన ఒక భావోద్వేగమని పేర్కొన్నారు. తమ ఉత్పత్తులతో నిర్మించే కట్టడాలు దృఢమైనవే కాకుండా, సమాజంతో ఏర్పరుచుకునే బంధాల్లోనూ నిజమైన దృఢత్వం ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఆలోకమయ్ కోల్‌కతా ద్వారా దీపావళి వేడుకలకు మరింత వెలుగు, ఆనందం, ఐక్యతను జోడించడం సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Police Sports | క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *