Osmania Medical Ragging | ఉస్మానియా కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది సస్పెన్షన్

హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థుల ఆగడాలు బయటపడ్డాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Osmania Medical Ragging |  హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో( Osmania Medical College ) సీనియర్ విద్యార్థుల ఆగడాలు బయటపడ్డాయి. బీడీఎస్ (BDS) ఫైనల్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు, అదే కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో కళాశాల యాజమాన్యం స్పందించింది.

Osmania Medical Ragging | పోలీసు కేసు..

కళాశాల ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ యాదవ్ వెంటనే స్పందించి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు, ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నిందితులైన విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సుల్తాన్ బజార్ పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
usmaniya 1

Osmania Medical Ragging | ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..

విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా నిషేధించినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం విద్యావేత్తలను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. చాలా కాలేజీల్లో ర్యాగింగ్ జరిగినా, భయంతో చాలా మంది బయటకు చెప్పడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ర్యాగింగ్ భూతాన్ని నిర్మూలించేందుకు కాలేజీ యాజమాన్యాలు మరింత కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Urea App Cancellation | యూరియా యాప్​ను రద్దు చేయాల్సిందే..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *