Hyderabad Murder | హైదరాబాద్​లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌లోని గోల్కొండలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Murder | హైదరాబాద్‌లోని గోల్కొండ (Golconda)లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అత్తింటివారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమార్‌వాడిలో శుక్రవారం మధ్యాహ్నం చందీ మసూద్ అలియాస్ షేక్ మసూద్ (30) అనే వ్యక్తిని కొట్టి చంపారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మసూద్ చాంది శుక్రవారం ప్రార్థనల అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు వెంబడించడం గమనించాడు. దీంతో అతను హడావిడిగా ఇంట్లోకి వెళ్లాడు. అయితే సోహైల్ అనే వ్యక్తి తన ముగ్గురు బావమరుదులు, ఒక మహిళా బంధువుతో కలిసి బలవంతంగా ఇంట్లోకి చొరబడి, డంబెల్ రాడ్లతో అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మసూద్ అక్కడికక్కడే మరణించాడు.

Hyderabad Murder | కేసు నమోదు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్​ టీమ్​ సాయంతో ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Nepal Gang Arrested | గచ్చిబౌలి చోరీ కేసు.. నేపాల్​ గ్యాంగ్ అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *