Santhosh Reddy Wife | మాజీ మంత్రి భార్య మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Santhosh Reddy Wife | మాజీమంత్రి, ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు శనిగరం సంతోష్ రెడ్డి(Shanigaram Santhosh Reddy) సతీమణి విజయ సోమవారం ఉదయం మరణించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్​లోని(Hyderabad) కొండాపూర్​లో నిర్వహించనున్నారు. ఆమె మృతి పట్ల ఆర్మూర్(Armoor)​ బాల్కొండ(Balkonda) నియోజకవర్గంలోని సంతోష్ రెడ్డి అనుచరులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.

Santhosh Reddy Wife | కొన్నేళ్లుగా కొండాపూర్​లోనే..

మాజీ మంత్రి శనిగరం సంతోష్​రెడ్డి కొన్నేళ్లుగా హైదరాబాద్​లోనే నివాసముంటున్నారు. ఆరోగ్యరీత్యా ప్రయాణాలు తక్కువ చేసుకున్న ఆయన కొండాపూర్​లోని స్వగృహంలో భార్య విజయతో శేషజీవితం గడుపుతున్నారు. కాగా ఆయన కాంగ్రెస్​ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలువురు సీఎంల దగ్గర మంత్రిగా పని చేశారు.

ఇది కూడా చదవండి: Today Gold Rates | మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా రేట్లు, ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *