Today Gold Rates | మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా రేట్లు, ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇవే!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Today Gold Rates | ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల నిర్ణయంలో లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ జరిగే ట్రేడింగ్ ఆధారంగానే ప్రపంచ దేశాల్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వ్యాపారం అమెరికన్ డాలర్లలో జరుగుతుండటంతో, డాలర్ విలువలో వచ్చే మార్పులు బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.

డాలర్ విలువ బలపడితే సాధారణంగా బంగారం ధరలు (Gold Rates) తగ్గే అవకాశం ఉంటుంది. అదే డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ ట్రెండ్స్, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి.

Today Gold Rates | స్థిరంగా ధ‌ర‌లు..

ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి దేశీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా నమోదయ్యాయి. శనివారం ఉన్న రేట్లే ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఉపశమనం లభించినట్లైంది. దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.1,59,060 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,800గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,290 వద్ద ట్రేడవుతుండగా, కేజీ వెండి ధర (Silver Price) రూ.2,85,000గా కొనసాగుతోంది.

Today Gold Rates | రాబోయే రోజుల్లో మళ్లీ ధరల్లో మార్పులు

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,800 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,59,210 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,45,950గా కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ వంటి నగరాల్లో కూడా హైదరాబాద్ (Hyderabad) తరహా ధరలే కొనసాగుతున్నాయి.

Today Gold Rates

అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,60,690 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,47,300గా నమోదైంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ మారకపు విలువలు, ఆర్థిక పరిస్థితులను బట్టి రాబోయే రోజుల్లో మళ్లీ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: May 25 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *