Hardik Pandya Captaincy | ముంబై పతనానికి హార్దిక్ కెప్టెన్సీనే కారణమా?.. ఐపీఎల్ 2026లో ఘోర వైఫల్యంపై చర్చలు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hardik Pandya Captaincy | ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) సీజన్ మాత్రం పూర్తిగా నిరాశనే మిగిల్చింది. కాగితాలపై చూస్తే జట్టు ఎంతో బలంగా కనిపించింది.

రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ, మైదానంలో మాత్రం ఆ అంచనాలకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది. సీజన్ ప్రారంభానికి ముందే టైటిల్ ఫేవరెట్‌గా భావించిన ముంబై ఇండియన్స్, లీగ్ దశ ముగియడానికి రెండు వారాల ముందే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది.

Hardik Pandya Captaincy | హార్ధిక్‌పై వేటు త‌ప్ప‌దా..

ఈ దారుణ ఫలితానికి ప్రధాన కారణం కెప్టెన్ హార్దిక్ పాండ్యానే (Hardik Pandya) అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం భారీ అంచనాల మధ్య ఐపీఎల్‌లోకి వచ్చిన హార్దిక్.. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా ప్రభావం చూపించలేకపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెన్నునొప్పి సమస్య హార్దిక్ ఆటపై ప్రభావం చూపినప్పటికీ, మ్యాచ్‌ల్లో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్స్, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు ప్రశ్నార్థకంగా మారింది. గణాంకాల పరంగా చూస్తే హార్దిక్ ప్రదర్శన మరింత నిరాశపరిచింది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో కేవలం 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. అతని ఎకానమీ రేటు కూడా దాదాపు 12కు చేరుకోవడం అభిమానులను అసంతృప్తికి గురి చేసింది.

Hardik Pandya Captaincy

Hardik Pandya Captaincy | గత సీజన్‌లో మూడో స్థానంలో

ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్‌తో (Rajastan Royals) జరిగిన చివరి మ్యాచ్ అనంతరం ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.మేము అనుకున్న విధంగా ఈ సీజన్ సాగలేదు. గత సీజన్‌లో మూడో స్థానంలో ఉన్నాం. ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాం. జట్టు ప్రదర్శనలో వచ్చిన ఈ భారీ మార్పులపై ఖచ్చితంగా చర్చించాల్సిందే. మా తప్పులను విశ్లేషించి, వచ్చే సీజన్‌లో బలంగా తిరిగి వస్తాం” అని పోలార్డ్ వ్యాఖ్యానించాడు. పోలార్డ్ ఎక్కడా హార్దిక్‌ను నేరుగా సమర్థించకపోవడం గమనార్హం.

Hardik Pandya Captaincy | ఆశించిన స్థాయిలో

దీంతో వచ్చే సీజన్ నాటికి ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది.ఒకప్పుడు ఐపీఎల్‌లో తిరుగులేని జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ 2020లో ఐదో టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో నిలవలేకపోతోంది. గత ఐదేళ్లలో మూడు సార్లు లీగ్ దశలోనే భారీ పరాజయాలను ఎదుర్కోవడం అభిమానులను కలవరపెడుతోంది. అందులో రెండు సార్లు హార్దిక్ పాండ్యా నాయకత్వంలోనే జరగడం మరింత చర్చకు దారి తీస్తోంది.

ఇది కూడా చదవండి..: RR Playoffs | ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్​లోకి దూసుకెళ్లిన ఆర్ఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *