క్రీడలుRR Playoffs | ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్​లోకి దూసుకెళ్లిన ఆర్ఆర్​

RR Playoffs | ముంబైపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్​లోకి దూసుకెళ్లిన ఆర్ఆర్​

ముంబై ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్​లోకి దూసుకెళ్లింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RR Playoffs | ముంబై ఇండియన్స్ (MI)​తో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​, బౌలింగ్​లో సత్తా చాటి ముంబైని చిత్తు చేసింది. అంతేగాకుండా ఈ విజయంతో ప్లే ఆఫ్స్​లోకి దూసుకెళ్లింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ముంబై, ఆర్​ఆర్​ మధ్య పోరు జరిగింది. ఇప్పటికే ఎలిమినేట్​ అయిన ముంబై ఈ మ్యాచ్​లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావించింది. అయితే తాము విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్​కు వెళ్లామని ఆర్ఆర్​ దూకుడుగా ఆడింది. మొదట బ్యాటింగ్​ చేసిన ఆర్​ఆర్​ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 175 పరుగులు మాత్రేమే చేసింది. దీంతో ఆర్​ఆర్​ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్​ గెలుపుతో పంజాబ్ (PBKS)​ క్వాలిఫైయర్ ఆశలు గల్లంతు అయ్యాయి.

RR Playoffs | రాణించిన ద్రువ్​ జురేల్​

మొదట బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్​కు శుభారంభం లభించింది. ఓపెనర్​ జైస్వాల్ (Jaiswal) దూకుడుగా ఆడాడు. 17 బంతుల్లో 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే వైభవ్​ సూర్యవంశీ ఈ మ్యాచ్​లో విఫలం అయ్యాడు. 4 పరుగులకే పెవిలయన్​ చేరాడు. దీంతో ఆర్​ఆర్​ 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం ధ్రువ్​ జురెల్​ 38, శనక 29, అర్చర్​ 32, జడేజా చివర్లో 19 పరుగులతో రాణించారు. దీంతో రాజస్థాన్​ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

RR Playoffs | ఆదిలోనే కష్టాలు

206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ రోహిత్​ శర్మ డకౌట్ అయ్యాడు. రికెల్టన్​, నమన్​ దీర్​, తిలక్​ వర్మ సైతం నిరాశ పరిచారు. సూర్యకుమర్​ యాదవ్ 60 పరుగులతో రాణించాడు. దీంతో ఆ జట్టుకు గెలుపుపై ఆశలు చిగురించాయి. అతడికి కెప్టెన్​ హర్దిక్​ పాండ్యా 15 బంతుల్లో 34 పరుగులతో సహకారం అందించాడు. విల్​ జాక్స్​ 33 పరుగులు చేశాడు. అయితే చివర్లో రాజస్థాన్​ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేసి వికెట్లు పడగొట్టారు. దీంతో ముంబై ఓడిపోగా.. రాజస్థాన్​ ప్లే ఆఫ్స్​లో చోటు దక్కించుకుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, గుజరాత్​ టైటాన్స్​ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు క్వాలిఫైయర్​–1లో తల పడుతాయి. ఎస్​ఆర్​హెచ్​, ఆర్​ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లు ఎలిమినేటర్​ ఆడనున్నాయి. క్వాలిఫైయర్​–1 లో ఓడిన జట్టు, ఎలిమినేటర్​లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్​ –2 ఆడుతుంది. క్వాలిఫైయర్​–1, –2లలో గెలిచిన జట్లు ఫైనల్​లోకి వెళ్తాయి. పాయింట్ల పట్టికలో ముంబై 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉండగా.. లక్నో కూడా 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

దీనిని కూడా చదవండి: Ram Charan Bumrah Comment | బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్​చరణ్​.. ఎందుకో తెలుసా?

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Mahila Bhavanalu | అతివల సాధికారతకు రేవంత్ సర్కార్ చారిత్రాత్మక అడుగు.. రేపు 8 వేల మహిళా భవనాలకు శంకుస్థాపన!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Mahila Bhavanalu | తెలంగాణ రాష్ట్రంలో మహిళా...

BC Gurukul Admissions | బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Gurukul Admissions | బీసీ గురుకుల...

Farmers Problems | అన్నదాతల అష్టకష్టాలు.. పట్టించుకోని ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers Problems | రాష్ట్రంలో అన్నదాతలు అష్టకష్టాలు...

Cheeta Force Nizamabad | వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Cheeta Force Nizamabad | నిజామాబాద్ పోలీస్​​...