BC Gurukul Admissions | బీసీ గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Gurukul Admissions | బీసీ గురుకుల జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సీట్ల కేటాయింపు మొదటి దశ ఫలితాలు విడుదల అయ్యాయి. సెలెక్ట్ అయిన విద్యార్థలు ఈ నెల 29వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని బీసీ గురుకులాల కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర బీసీ గురుకుల విద్యా సంస్థ (MJPTBCWREIS) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ (RJC), డిగ్రీ కాలేజీ అడ్మిషన్లకు సంబంధించి మొదటి దశ  ఫలితాలు సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఆదివారం ప్రకటించారు.  విద్యార్థులు తమ ఫలితాలను, కాలేజీ వివరాలను https://mjptbcwreis.telangana.gov.in(లేదా)
https://mjptbcadmissions.org/MJP-Inter  వెబ్​సైట్​లలో చూసుకోవచ్చు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా 10వ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతోందన్నారు.

BC Gurukul Admissions | డిగ్రీ కాలేజీలో..

డిగ్రీ కాలేజీలకు ఎంపికైన విద్యార్థులు తగిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని, ఈనెల 25 లో తేదీ నుండి ఈనెల 30వ తేదీ  వరకు సంబంధిత కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-23328266 లో సంప్రదించాలని సూచించారు.

దీనిని కూడా  చదవండి : Farmers Problems | అన్నదాతల అష్టకష్టాలు.. పట్టించుకోని ప్రభుత్వం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *