Nandipet Students | డివిజన్ స్థాయి ప్రతిభాపోటీల్లో నందిపేట్​ విద్యార్థుల ప్రతిభ

ఆర్మూర్ డివిజన్ స్థాయిలో పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నందిపేట్: Nandipet Students | భారత ఎలక్షన్ కమిషన్ ఈసీఐ (ECI) ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ స్థాయిలో పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నందిపేట్ (Nandipet) మండల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు.

Nandipet Students | డివిజన్​ స్థాయిలో..

ఆర్మూర్​ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో డివిజన్ స్థాయిలో ఎంపికైన 20 మంది విద్యార్థులలో 10 మంది నందిపేట్​ విద్యార్థులు జిల్లాస్థాయికి అర్హత సాధించారు. జిల్లాస్థాయిలో కూడా విద్యార్థులు ఇదే ప్రతిభ కనబర్చి మండలానికి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదివింది: చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తేనే.. గిగ్ వర్కర్లకు పూర్తి న్యాయం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *