Congress Party Controversy | కాంగ్రెస్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు!

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో కాంగ్రెస్​ పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నెట్​వర్క్​: Congress Party Controversy | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో కాంగ్రెస్​ పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యేపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Congress Party Controversy | దుర్భాషలాడాడని ఆరోపణలు..!

జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) పలువురు ఎమ్మెల్యేల సమక్షంలోనే అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడే ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం. ఒక సీనియర్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేతో వ్యవహరించిన తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Congress Party Controversy | ఎమ్మెల్యే ఆత్మగౌరవానికి భంగం కలిగేలా..

ఎమ్మెల్యేపై ఆ స్థాయిలో విరుచుకుపడ్డారనే అంశం ప్రస్తుతం జుక్కల్​ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తక్షణమే స్పందిస్తూ, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్​కు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​కు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ముందస్తు అధికారికంగా ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Firecracker Sales Rules | క్రాకర్స్ విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీ సాయిచైతన్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *