Telangana University Snakebite | తెయూ హాస్టల్​లో కలకలం.. విద్యార్థినికి పాముకాటు

తెలంగాణ యూనివర్సిటీ బాలికల హాస్టళ్లలో మంగళవారం రాత్రి ఓ విద్యార్థినికి పాము కాటు వేయడం కలకలం రేపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Snakebite | తెలంగాణ యూనివర్సిటీ బాలికల హాస్టళ్లలో ఓ విద్యార్థినికి పాము కాటు వేయడం కలకలం రేపింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Telangana University Snakebite | అర్థశాస్త్రం చదువున్న విద్యార్థిని..

అర్థశాస్త్రం ఫస్టియర్​ చదువుతున్న విద్యార్థిని కవిత హాస్టళ్లలోని కారిడార్​లో చదువుకుంటుండగా పాము కాటేసింది. విషయాన్ని హాస్టల్ సిబ్బందికి చెప్పడంతో అప్రమత్తమైన వారు విద్యార్థినిని యూనివర్సిటీ అంబులెన్స్​లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కవిత క్షేమంగా ఉన్నట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి జిల్లా (Yadagiri District) ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పాముకాటుకు గురైన కవితను పరామర్శించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

Telangana University Snakebite | హాస్టల్​లో రక్షణ చర్యలు చేపట్టాలి

యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని, విష పురుగులు, పాములు గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థినులు గతంలో ఆందోళన చేసి అధికారులకు విన్నవించారు. హాస్టళ్లలో సమస్యలపై వార్డెన్, చీఫ్​ వార్డెన్​లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. విష పురుగులు హాస్టల్లోకి రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని, హాస్టల్లో రక్షణచర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Rajaram Dubba Cordon | రాజారాం దుబ్బలో కార్డన్​ సెర్చ్​.. పలు వాహనాలు సీజ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *