అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Food Safety Raids | నగరంలోని (Nizamabad) పలు హోటళ్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్వహణ సరిగ్గా లేని రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు.
Nizamabad Food Safety Raids | గ్లామర్ హోటల్లో..
హైదరాబాద్ నుంచి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా విడిపోయారు. ఈ సందర్భంగా 1వ టౌన్ పరిధిలోని తిలక్‌గార్డెన్ వద్ద ఉన్న గ్లామర్ హోటల్లో తనిఖీలు చేశారు. అస్తవ్యస్త కిచెన్, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో హోటల్‌ను సీజ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి హోటల్ ఆహారభద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లేకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఫ్రెష్ బ్రీత్ కోసం… హెల్త్ రిస్క్ వద్దు…