అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : SIR Form Campaign | జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో అధికారులు ఇప్పటికే ఆయా డివిజన్ల
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ (BJP) సైతం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. నగరంలోని 22వ డివిజన్లో ఎస్ఐఆర్ను వేగవంతం చేసేందుకు కార్పొరేటర్ వినూత్నంగా ప్రయత్నాలు ప్రారంభించారు.
SIR Form Campaign | ప్రజలకు అవగాహన కల్పించేందుకు..

ఈ సందర్భంగా 22వ డివిజన్లో ఓటర్లను చైతన్యపర్చేందుకు వినూత్నంగా ఆలోచించారు కార్పొరేటర్ పులగం వైష్ణవి సుధా. బీఎల్వోల వద్ద నుంచి తీసుకున్న ఫారాలు వెంటనే తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని సూచించారు. ఫారాలు తిరిగిచ్చిన వారికి బంపర్ డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. మొదటి బహుమతిగా మిక్సీ, రెండో బహుమతిగా కుక్కర్, మూడో బహుమతిగా ఫ్యాన్, ఎలక్ట్రిక్ కేటిల్ అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఆయా కాలనీల్లో బంపర్డ్రా విషయంపై కరపత్రాలు పంచిపెడుతున్నారు. తద్వారా ఫారాలను బీఎల్వోలకు అందజేయాలని సూచిస్తున్నారు. ఈ ప్రయోగం ఫలించి ఓటర్లు తమ వద్ద ఉన్న ఫారాలను బీఎల్వోలకు అందజేస్తారని కార్పొరేటర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Congress SIR Plan | ‘సర్’ పర్యవేక్షణకు కాంగ్రెస్ ప్రణాళిక.. పర్యవేక్షకులు, అసెంబ్లీ కోఆర్డినేటర్ల నియామకం..