Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ వాల్ ​పోస్టర్ల ఆవిష్కరణ

జాతీయ లోక్​ అదాలత్​ వాల్​పోస్టర్లను జిల్లా న్యాయమూర్తి జీవీఎన్​ భరతలక్ష్మి ఆవిష్కరించారు. ఈ మేరకు జిల్లా కోర్టులో ఈ కార్యక్రమం నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​ (National Lok Adalat) వాల్​ పోస్టర్లను జిల్లా న్యాయమూర్తి(District Judge) జీవీఎన్​ భరతలక్ష్మి ఆవిష్కరించారు. ఈ మేరకు జిల్లా కోర్టులో(Nizamabad Court) బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

Lok Adalat | రాజీమార్గమే రాజమార్గం..

వాల్​పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీన జాతీయ లోక్​ అదాలత్​ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,650 క్రిమినల్ కేసులు రాజీ చేసుకోదగ్గవిగా గుర్తించామన్నారు.

అందులో 1,567 కేసులకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వివరించారు. అలాగే 668 చెక్​బౌన్స్​ కేసులు, 16 బ్యాంకు రికవరీ కేసులు, 130 బీమా కేసులకు సంబంధించి కూడా కక్షిదారులకు నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు.

రాజీమార్గమే రాజమార్గమని.. త్వరగా కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్​ చక్కని మార్గమని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా సివిల్, క్రిమినల్, పీఎస్​సీ కేసుల్లో రాజీ చేసుకోవాలనుకుంటే 20వ తేదీ లోపల కోర్టుకు వచ్చి రాజీ చేసుకోవాలని ఆమె వివరించారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి వీడియో కాల్ ద్వారా తమ కేసులను రాజీ చేసుకునే సౌలభ్యం కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.

court

ఇది కూడా చదవండి: Hyderabad Rain Traffic | అంతర్జాతీయ నగరమంటూ ప్రచారం.. చిన్న వర్షానికే ట్రాఫిక్ నరకం!.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బతీస్తున్న మౌలిక వసతుల వైఫల్యాలు

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *