MHSRB Assistant Professor | మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు.. ఎంపిక జాబితా విడుదల.. త్వరలో నియామక ఉత్తర్వులు

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 34 విభాగాల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MHSRB Assistant Professor | తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చడంతో పాటు వైద్య విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోని 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) పూర్తి చేసింది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేసింది.

MHSRB Assistant Professor | గతంలో నోటిఫికేషన్

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం 34 విభాగాల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందులో అనస్థీషియాలజీ, ప్రసూతి – గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు చెందిన 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఎంపికైన అభ్యర్థులకు ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నియామక పత్రాలు అందజేశారు.

తాజాగా మిగిలిన 30 విభాగాల్లోని 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాను విడుదల చేయడంతో నియామక ప్రక్రియ పూర్తయింది. వీటితో పాటు నాలుగు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించిన ఎంపిక జాబితాను కూడా ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ప్రకటించింది.

akshara today .jpgmedical

MHSRB Assistant Professor | త్వరలోనే ఉత్తర్వులు

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పీచ్ పాథాలజిస్టులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లు, ఇతర ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో మానవ వనరుల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

MHSRB Assistant Professor | దాదాపు 15 వేల పోస్టుల భర్తీ

గత రెండున్నరేళ్ల కాలంలో ఆరోగ్య శాఖలో దాదాపు 15 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. వీటిలో ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది తదితర కీలక ఉద్యోగాలు ఉన్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం చేపట్టిన ఈ నియామకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వైద్య విద్యా నాణ్యతను మరింత మెరుగుపరుస్తాయని, తెలంగాణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *