అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) గుడ్న్యూస్ చెప్పారు. ఇంటి నిర్మాణం పూర్తయిన చివరి బిల్లు రాక పలువురు ఎదురు చూస్తున్నారు. వారికి త్వరలోనే నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
పాలేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా నేలకొండపల్లిలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన 145 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి మంజూరు పత్రాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ కొద్ది రోజుల్లోగా జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు పూర్తయినా బిల్లు రాలేదని ఆందోళన చెందొద్దన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగంగా చేపట్టేలా అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Indiramma Houses | గత ప్రభుత్వం పట్టించుకోలేదు
గత ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేర్చలేదని పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ మూడు, నాలుగు విడతల్లో ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.
దీనిని కూడా చదవండి : Thummidihatti Project | మహారాష్ట్ర సీఎంతో రేవంత్రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై చర్చ