New Pensions | ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : New Pensions | రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వారికి మంత్రి సీతక్క (Minister Seethakka) గుడ్​ న్యూస్​ చెప్పారు. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

తాము అధికారంలోకి వస్తే పింఛన్​ పెంచుతామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే రెండున్నర ఏళ్లు అవుతున్న పింఛన్లు పెంచలేదు. అలాగే కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో లక్షలాది మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. దీంతో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్​ 2 నుంచి పింఛన్లు మంజూరు చేస్తామని గతంలో చెప్పినా.. తర్వాత అది ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సీతక్క ప్రకటనతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

New Pensions | వారి పేర్లు తొలగించాలి

తెలంగాణలో ఆగస్టు 15 నుంచి వితంతు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఆగస్టు 20 నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’, నీటి కుంట–ఊటీ కుంట–పంట కుంట’ పనులకు శ్రీకారం చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి గ్రామం అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.

దీనిని కూడా చదవండి : Fake Documents | ఫేక్​ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా అరెస్ట్​..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *