అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Retired IPS Wife Murder | హైదరాబాద్ నగరంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజా రంజన్‌ను నేపాల్ ముఠా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) మీడియాకు వివరాలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్‌లో మే 7న రాత్రి రిటైర్డ్ ఐపీఎస్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. వారి ఇంట్లో పని చేసే నేపాల్‌కు చెందిన పని మనుషులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దోపిడీ చేసే యత్నంలో తనజా రంజన్‌ను హత్యచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం నేపాల్ ముఠాలు పని మనుషుల రూపంలో వచ్చి చోరీ చేసిన ఘటనలు వెలుగు చూడటంతో కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ మేరకు హత్య కేసులో ప్రధాన నిందితురాలు ధర్మ తిరువ అలియాస్ కల్పనతో సహా మొత్తం నలుగురిని అరెస్టు చేశారు.
Retired IPS Wife Murder | పని మనిషిగా చేరి..
కల్పన 2025 జూన్‌లో ఒక బంధువు ద్వారా హైదరాబాద్‌కు వచ్చింది. అనంతరం జూబ్లీహిల్స్‌లోని రిటైర్డ్ ఐపీఎస్ (Retired IPS Wife Murder) అధికారి ఇంట్లో నెలకు సుమారు రూ.20 వేల జీతంతో పనిమనిషిగా చేరింది. అనంతరం ఆమె పూణేలో ఉంటున్న బికాస్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపింది. బికాస్ ఆ ఇంట్లో దోపిడీ చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు గణేష్ బహదూర్ షాహి, శంకర్ చంద్ర లామా, సునీల్ పరియార్తో కలిసి అతడు చోరీకి ప్రణాళిక రూపొందించాడు. వీరు మే 7న రాత్రి ఇంట్లోకి చొరబడి తనుజాను బంధించి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం బీరువాలు, లాకర్లు పగులకొట్టి 225 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో పరారయ్యారు.
ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇతర రాష్ట్రాల్లో విచారణ చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. మరి కొందరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Railway Travel Insurance | రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 45 పైసలకే రూ. 10 లక్షల ఇన్సూరెన్స్