US Shooting Incident | అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Shooting Incident | అగ్రరాజ్యం అమెరికా (America)లో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అయోవా రాష్ట్రంలోని మస్కటైన్‌లో సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) పలుచోట్ల జరిగిన వరుస కాల్పుల ఘటనల్లో అనుమానితుడితో సహా ఏడుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రకారం ఈ కాల్పులు ‘కుటుంబ సంబంధిత వివాదం’ కారణంగా జరిగినట్లు తెలుస్తోంది. బాధితులందరూ మరణించిన అనుమానితుడి కుటుంబ సభ్యులేనని భావిస్తున్నారు. మస్కటైన్ పోలీసులు (Muscatine Police) అనుమానితుడిని 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్లాండ్‌గా గుర్తించారు. అతను తనను తాను కాల్చుకోవడం వల్ల గాయపడి మరణించాడని తెలిపారు.

US Shooting Incident | సమాచారం అందగానే..

US Shooting Incident

పార్క్ అవెన్యూ (Park Avenue)లో కాల్పులు జరిగినట్లు మస్కటైన్ కౌంటీ జాయింట్ కమ్యూనికేషన్స్ సెంటర్‌కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అధికారులు, అత్యవసర వైద్య సిబ్బందిని ఘటనా స్థలానికి పంపినట్లు పేర్కొన్నారు. నివాసంలోకి ప్రవేశించిన అధికారులు, తుపాకీ గాయాలతో ఉన్న నలుగురిని గుర్తించారు. నలుగురు బాధితులు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు. ఇంకా ఎక్కువ మంది బాధితులు ఉండే అవకాశం ఉందని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

US Shooting Incident

అనుమానితుడు ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్లాండ్‌ రివర్‌ఫ్రంట్ ట్రైల్ వద్ద తనను తాను కాల్చుకున్న స్థితిలో కనిపించాడు. అధికారులు మరియు అత్యవసర వైద్య సేవల (EMS) సిబ్బంది వైద్య సహాయం అందించారు, కానీ అతను సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు. 1509 మిల్ స్ట్రీట్‌లోని ఒక నివాసంలో బుల్లెట్​ గాయంతో మరణించిన ఒక వ్యక్తిని అధికారులు గుర్తించారు. 808 గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని కూడా బుల్లెట్​ గాయంతో మరణించిన మరో వ్యక్తిని గుర్తించారు. వరుస కాల్పుల ఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Masoud Pezeshkian Resignation | ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం.. అధ్యక్షుడు పెజెష్కియన్ రాజీనామా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *