అక్షరటుడే, భీమ్‌గల్(కమ్మర్పల్లి): Poker Raid | కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో (Kammarpally Police) పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై సీహెచ్ సతీష్ వివరాలు వెల్లడించారు.
Poker Raid | హాసాకొత్తూర్ గ్రామ శివారులో..
హసకొత్తూర్ గ్రామ శివారులో రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 16 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరో ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ.21,800 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని.. నిందితులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పరారైన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: తప్పు ఎవరు చేసినా తప్పే.. రేవంత్ సర్కార్‌పై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్!