అక్షరటుడే వెబ్‌డెస్క్: Muthoot Fincorp BCCI Sponsorship | భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – వెస్టిండీస్ సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 14న హైదరాబాద్‌లో ( Hyderabad ) హైఓల్టేజ్ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. దేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ హోమ్ సిరీస్‌లు, టోర్నమెంట్లు , దేశవాళీ మ్యాచ్‌లకు ప్రముఖ సంస్థ ‘ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్’ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
Muthoot Fincorp BCCI Sponsorship | దేశవాళీ టోర్నీలకు వర్తింపు..
ఈ స్పాన్సర్షిప్ కేవలం సీనియర్ జట్లకే కాకుండా విస్తృత స్థాయిలో వర్తించనుంది. భారత పురుషుల, మహిళల సీనియర్ జట్లతో పాటు… ఇండియా-ఎ, ఇండియా-బి పురుషుల జట్లు, ఇండియా-ఎ మహిళల జట్టు, అండర్-19 పురుషుల, మహిళల జట్ల మ్యాచ్‌లకు ఇది వర్తిస్తుంది. అలాగే దేశవాళీ క్రికెట్లోని ప్రతిష్టాత్మక టోర్నమెంట్లైన రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలకు కూడా ముత్తూట్ ఫిన్‌కార్ప్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుంది.
Muthoot Fincorp BCCI Sponsorship | బలమైన అనుబంధం..
ఈ భాగస్వామ్యంపై ముత్తూట్ ఫిన్‌కార్ప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ థామస్ జార్జ్ ముత్తూట్ , సీఈఓ షాజీ వర్గీస్ స్పందిస్తూ… ప్రతి భారతీయుడి జీవితంలో క్రికెట్ ఒక భాగమని, జాతీయ , దేశవాళీ వేదికలపై క్రికెట్‌కు మద్దతు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముత్తూట్ ఫిన్‌కార్ప్ లోగోలోని నీలి రంగు, భారత క్రికెట్ జట్టు జెర్సీ రంగితో సరిగ్గా సరిపోతుందని, ఇది రెండు బ్రాండ్ల మధ్య సహజమైన అనుబంధాన్ని చాటుతుందని తెలిపారు.
Muthoot Fincorp BCCI Sponsorship | బీసీసీఐ హర్షం..
బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ , గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ… ముత్తూట్ ఫిన్‌కార్ప్‌ను బీసీసీఐ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు. అట్టడుగు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని విభాగాల అభివృద్ధికి ఈ భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు, హైదరాబాద్‌లో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: JNU Sexual Harassment Case | జేఎన్‌యూ లైంగిక వేధింపుల ఘటన.. కాంగ్రెస్ నేతల మౌనంపై పురందేశ్వరి ఫైర్