అక్షరటుడే వెబ్‌డెస్క్: GE Aerospace India Investment | విమానయాన రంగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తున్న భారత మార్కెట్‌పై ప్రముఖ గ్లోబల్ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ‘జిఈ ఏరోస్పేస్’ (GE Aerospace) కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో విమాన ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడంతో పాటు, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలకు మద్దతుగా 2025 నుండి 2030 నాటికి దేశీయ సరఫరాదారులపై (Local Suppliers) చేసే వ్యయాన్ని రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా టేకింగ్ ఫ్లైట్’ సదస్సులో ఎర్న్స్ట్ & యంగ్ (EY) రూపొందించిన ప్రత్యేక నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది.
GE Aerospace India Investment | 3.70 లక్షల ఉద్యోగాలు..
భారత విమానయాన రంగానికి జిఈ ఏరోస్పేస్ అందిస్తున్న సేవలు , ఆర్థిక ప్రభావాన్ని ఈ నివేదిక స్పష్టంగా వెల్లడించింది.
ఆర్ధిక ప్రగతి: 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) భారత వాణిజ్య విమానయాన సంస్థలు USD $19 బిలియన్ల రాబడిని సాధించాయి. ఈ ఏవియేషన్ వ్యవస్థ ద్వారా దేశంలో ప్రత్యక్షంగా సుమారు 3.70 లక్షల ఉద్యోగాలకు మద్దతు లభిస్తోంది.
భారీ మార్కెట్ షేర్: భారత ఆకాశంలో ఎగురుతున్న మెజారిటీ వాణిజ్య విమానాలకు జిఈ ఏరోస్పేస్ , దాని భాగస్వామ్య సంస్థల ఇంజిన్లే శక్తినిస్తున్నాయి. ప్రస్తుతం 1,400 కంటే ఎక్కువ ఇంజిన్లు ఇక్కడ సేవలు అందిస్తున్నాయి.
పూణే, బెంగళూరు కేంద్రాల పాత్ర: పూణే ప్లాంట్‌లో నాణ్యమైన విడిభాగాల తయారీ, బెంగళూరులోని గ్లోబల్ టెక్నాలజీ సెంటర్లో జరిగే నూతన ఆవిష్కరణలు గ్లోబల్ సప్లై చైన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2025లో భారతీయ సరఫరాదారులపై USD $200 మిలియన్లు ఖర్చు చేయగా, 2030 నాటికి ఈ మొత్తాన్ని రెట్టింపు చేయనున్నారు.
GE Aerospace India Investment | అదనపు ఇంజిన్ల అవసరం..
భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం, దేశంలో విమానాశ్రయాల సంఖ్య 2047 నాటికి 163 నుంచి 350 కంటే ఎక్కువకు చేరనుంది. దీనివల్ల ప్రతిఏటా ప్రయాణించే వారి సంఖ్య 340 మిలియన్ల నుండి 2040 నాటికి 1.1 బిలియన్కు చేరుకుంటుంది.
ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి 2044 నాటికి భారత్, దక్షిణాసియా ప్రాంతానికి అదనంగా 3,300 విమానాలు (6,600 ఇంజిన్లు) అవసరమవుతాయి. ఇండిగో సంస్థ ఇప్పటికే 510 విమానాల కోసం 1,000 కంటే ఎక్కువ LEAP-1A ఇంజిన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భారతదేశ నిర్వహణ, మరమ్మతు (MRO) పరిశ్రమకు దీని ద్వారా బిలియన్ల డాలర్ల వ్యాపార అవకాశాలు దక్కనున్నాయి.
GE Aerospace India Investment | ఆవిష్కరణల్లో కీలక భాగస్వామి..
తేజస్, అపాచీ విమానాలకు శక్తి: 1986 నుండి హెచ్ఏఎల్ (HAL) భాగస్వామ్యంతో పనిచేస్తున్న జిఈ ఏరోస్పేస్, స్వదేశీ యుద్ధ విమానం ‘తేజస్ మార్క్-1’కి F404 ఇంజిన్లను అందిస్తోంది. తేజస్ మార్క్-2 ప్రోగ్రామ్ కోసం F414 ఇంజిన్లను భారత్‌లోనే తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
బెంగళూరు టెక్ సెంటర్ ఘనత: బెంగళూరులోని ( Bengaluru ) రీసెర్చ్ సెంటర్ ఇప్పటివరకు 1,000కి పైగా ఏవియేషన్ పేటెంట్లను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ‘GE9X’ జెట్ ఇంజిన్ అభివృద్ధిలోనూ, అలాగే 20% మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించే CFM RISE ప్రాజెక్ట్‌లోనూ ఇక్కడి భారతీయ ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: JNU Sexual Harassment Case | జేఎన్‌యూ లైంగిక వేధింపుల ఘటన.. కాంగ్రెస్ నేతల మౌనంపై పురందేశ్వరి ఫైర్