అక్షరటుడే వెబ్డెస్క్: Sana Satish Babu | రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ ( kakinada )జిల్లాకు చెందిన జెన్-జీ యువతతో కలిసి రాఖీ పండుగను వినూత్న రీతిలో జరుపుకున్నారు. కొప్పవరం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాలేజీ విద్యార్థినులు ఎంపీ సతీష్ బాబుకు రాఖీలు కట్టారు.
Sana Satish Babu | యువతతో ముఖాముఖి ..
రాఖీ అనంతరం విద్యార్థినులతో కలిసి ఎంపీ అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) చేస్తూ స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా యువత కెరీర్ లక్ష్యాలు, విద్య, ఉపాధి అవకాశాలు, కాకినాడ అభివృద్ధిపై వారి ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. వారి శైలిలోనే సరదాగా ఆత్మీయంగా మాట్లాడి ఉత్సాహపరిచారు.

Sana Satish Babu | ప్రత్యేక దృష్టి..
కాకినాడలో యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎంపీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు మెరుగైన భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థినులకు గిఫ్టులు, చాక్లెట్లు అందజేసి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. కేవలం పండుగ వేడుకగానే కాకుండా, యువత ఆకాంక్షలను తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Rakhi Festival | ఆత్మీయత అనురాగానికి ప్రతీక.. రాఖీ పండుగ