అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponguleti Srinivasa Reddy | తమది ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమం , రైతుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ‘రైతు ఆశీర్వాద సభ’లో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తూ, ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండేళ్లలోనే సుమారు 71 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి తెలిపారు. త్వరలోనే 17 నుంచి 20 వేల ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. యువతకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు.
Ponguleti Srinivasa Reddy | భూ సర్వే -భూధార్ కార్డులు..
రాష్ట్రంలోని వ్యవసాయ రంగంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగుళం భూమిని సర్వే చేస్తామని, సాగులో ఉన్న ప్రతి రైతుకు మ్యాప్‌లతో కూడిన ‘భూధార్’ కార్డులను అందజేస్తామని చెప్పారు. “రైతులను రాజులను చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఆ దిశగానే మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
Ponguleti Srinivasa Reddy | కాళేశ్వరంపై సంచలన వ్యాఖ్యలు..
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని, దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని సంకేతాలిచ్చారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు కడుపులో విషం పెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మరింత భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
Ponguleti Srinivasa Reddy | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ..
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి తెలిపారు. ఇప్పటికే రెండో విడత ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలోనే మూడవ , నాలుగవ విడతలో భాగంగా మిగిలిన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ ఆశీర్వదిస్తున్నారని, అదే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తొలి రెండేళ్లలో 71 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 17 నుంచి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని మండిపడిన ఆయన, బీఆర్ఎస్‌కు… pic.twitter.com/4hnphWjjkM
— TG Govt Updates (@TGGovtUpdates) July 10, 2026
ఇది కూడా చదవండి: Sheikh Hasina Return | అరెస్ట్ చేసినా.. చంపేసినా సరే స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా