Free Medical Camp | న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రధాన, సెషన్స్ న్యాయమూర్తి జేవీఎన్​ భారత లక్ష్మి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Free Medical Camp | న్యాయవాదులు వృత్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రధాన, సెషన్స్ న్యాయమూర్తి జేవీఎన్​ భారత లక్ష్మి సూచించారు. మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ (Nizamabad) ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

Free Medical Camp | వైద్యశిబిరం.. అభినందనీయం..

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ సభ్యులు, జ్యుడీషియరీ ఎంప్లాయీస్​ కోసం మెడికవర్​ హాస్పిటల్స్​ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ.. బార్ సభ్యుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికవర్ హాస్పిటల్స్ ఈ శిబిరాన్ని నిర్వహించడం బాగుందని.. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్, బార్ అసోసియేషన్ సెక్రెటరీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు అందించడం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు శిబిరం ఎంతో ఉపయోగపడిందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ అందిస్తున్న నిపుణుల వైద్య సేవలను ఆయన ప్రశంసించారు.

Free Medical Camp | అన్నిరకాల పరీక్షలు..

శిబిరానికి 250 మందికి పైగా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఉచిత వైద్య సేవలను పొందారు. శిబిరంలో కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, నెప్రాలజి, ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, గైనకాలజీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. శిబిరానికి 250 మందికి పైగా హాజరై ఉచిత వైద్య సేవలు పొందారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ కె.స్వామి, డీఎంఎస్ డాక్టర యజ్ఞ, ఆస్పత్రి వైద్యులు, మార్కెటింగ్ బృందం, బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Enumeration Forms | ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు త్వరితగతిన బీఎల్​వోలకు అందించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *