నిజామాబాద్NEET UG Exam | ప్రశాంతంగా ముగిసిన ‘నీట్​’

NEET UG Exam | ప్రశాంతంగా ముగిసిన ‘నీట్​’

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో నీట్​ యూజీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: NEET UG Exam | జిల్లా కేంద్రంలో నీట్​ యూజీ (NEET UG) పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉదయమే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.

NEET UG Exam | పరీక్షకు ‘నిమిషం’ నిబంధన..

నీట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై ఐదు గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు రెండు మూడు గంటలు ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 3,334 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,227 పరీక్షకు హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదనే నిబంధన ఉండడంతో విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకున్నారు.

NEET UG Exam | పోలీసుల ఆధ్వర్యంలో భద్రత..

ఈ సందర్బంగా గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాలలో (Giriraj Government College) పరీక్ష కేంద్రాన్ని సీపీ సాయిచైతన్య తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు సలహాలు అందజేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బద్ధోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సూచనలు సలహాలు అందజేశారు. అలాగే పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్​ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలను మూసి వేయించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా ఆయా పరీక్ష కేంద్రాల సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.

1

12 1

33

112

ఇది కూడా చదవండి: Battery Fan Blast| మెదక్ జిల్లాలో ప్రమాదం.. బ్యాటరీ పేలి తెగిపడిన బాలుడి వేళ్లు !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Psycho Incident | చేతిలో కటర్​తో సైకో వీరంగం..భయాందోళనకు గురైన ప్రజలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Psycho Incident | చేతిలో కటర్​తో (cutter...

Urja Suraksha | ప్రపంచమంతా ఇంధన సంక్షోభం.. ‘ఆపరేషన్ ఊర్జ సురక్ష’తో భారత్ సేఫ్!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Urja Suraksha | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఈ...

Muscat Abuse Case| “పవనన్నా.. ప్లీజ్ కాపాడండి”.. మస్కట్ నుండి తెలుగు మహిళ కన్నీటి విజ్ఞప్తి!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Muscat Abuse Case| బ్రతుకుదెరువు కోసం వెళ్లిన చోట...

Rains in Telangana | తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Rains in Telangana | తెలంగాణలోని పలు జిల్లాల్లో...